SRPT: అర్వపల్లి మండల పరిధిలోని సాగు భూములకు వారబందీ విధానంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చివరి విడత గోదావరి జలాలను విడుదల చేశారు. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం 5 తడుల నీటిని విజయవంతంగా పంపిణీ చేసిన జలవనరుల శాఖ, తాజాగా 6వ తడి కింద సుమారు 1,333 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదిలింది. వారబందీ పద్ధతిలో భాగంగా ఈ నీటి సరఫరా మరో వారం రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది.