ADB: జిల్లాలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మి వాడలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఇన్స్‌స్పెక్టర్ కె. నాగరాజు ఆధ్వర్యంలో నిందితులు షేక్ సమీర్, షేక్ అబ్దుల్ ఫయాజ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి వెండి పట్టీలు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలను 100% రికవరీ చేశారు.