HYD: అత్తాపూర్, లంగర్ హౌజ్ ప్రాంతాల్లో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. మోసగాళ్లు ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, సోషల్ మీడియా ద్వారా ప్రజలను మాటల్లో ముంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఇటీవల 10కి పైగా కేసులు నమోదయ్యాయి. అపరిచిత కాల్స్, లింకులను నమ్మవద్దని, OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.