విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై చర్చలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే అధికారులు బిల్లింగ్ ప్లాన్‌కు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించారు. విద్యుత్, నీటి సదుపాయాలపై అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే భూమి పూజ జరుగనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 601 ఎకరాలు కేటాయించారు.