MBNR: మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన ఓ వివాహితుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకోవాలని కోరగా, నిరాకరించడంతో అతడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో శుక్రవారం ధర్నాకు దిగారు. అతడికి అప్పటికే పెళ్లే ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు.