అదిలాబాద్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. ఈగల్ ఫోర్స్ ద్వారా గంజాయి నిర్మూలన, షీ టీమ్స్ ద్వారా మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ‘అరైవ్ అలైవ్’ పేరుతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని వారు ప్రజలను కోరారు.