అల్లూరి: కొయ్యూరు మండలం నడింపాలెం ఆశ్రమ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు సాగిన రాజబాబు పడాల్ పీహెచ్డీ పట్టా పొందారు. ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, వైస్ ఛాన్సెలర్ రాజశేఖర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా స్వీకరించారు. మోక రత్నరాజు రచనలు, పరిశీలన అనే అంశంపై ఆయన పరిశోధనలు చేశారు. డాక్టరేట్ పొందడంపై పలువురు ఆయనను శుక్రవారం అభినందించారు.