HNK: మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ (MRPS-TG) HNK జిల్లా అధ్యక్షుడిగా చిలువేరు బాబు మాదిగను నియమించినట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ.. మాదిగల సమస్యల పోరాటానికి అంకితభావంతో కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.