KRNL: కర్నూలు నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి పన్నులు చెల్లించడానికి 3 రోజులే మిగిలి ఉన్నాయని, ప్రజలు ఆలస్యం చేయకుండా పన్నులు చెల్లించాలని మున్సిపల్ మేనేజర్ చిన్నరాముడు కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనున్నందున అదేరోజు 50శాతం వడ్డీ రాయితీ అవకాశం సైతం ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.