JGL: కథలాపూర్ మండలం చింతకుంట ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలకు పుష్పాభిషేకం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, నాయకులు పేర్కొన్నారు. సర్పంచ్ నాగం భూమయ్య, హెచ్ఎం సుధాకర్, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.