జీవితంలో ముగ్గురిని ఎప్పటికీ మర్చిపోకూడదని శర్వానంద్ అన్నాడు. ‘బైకర్’ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘కష్టాల్లో తోడున్నవారిని, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, మనల్ని కష్టాల్లోకి నెట్టిన వారిని ఎన్నటికీ మర్చిపోవద్దు. ఎవరైనా నిరుత్సాహపరిచినా పట్టించుకోకండి. మీ విజయమే అవమానించిన వారికి అసలైన సమాధానం కావాలి. మనసు పెడితే ఏదైనా సాధించగలం’ అని చెప్పాడు.