KNR: చొప్పదండికి చెందిన కొండపాక అతర్వ్ అండర్ 10 విభాగంలో రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అతర్వ్ను శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయం క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ఆయన ప్రశంసించాడు.