TG: ఏపీలోని మార్కాపురం జిల్లా బస్సు ప్రమాదంపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అలాగే భువనగిరి జిల్లాలో చిన్న పిల్లాడి కళ్లను కుక్కలు లాగెళ్లిన ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తీరాలంటే కొత్త రాజకీయ పార్టీ రావాలన్నారు. అందుకే కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వెల్లడించారు.