IPLలో ఓ ప్లేయర్ వరుసగా 3 సీజన్లలో 600+ రన్స్ చేయడం అంటే మాములు విషయం కాదు. అందుకేనేమో.. 18 ఏళ్ల టోర్నీలో ముగ్గురికే ఈ ఫీట్ సాధ్యమైంది. తొలుత గేల్ 2011లో 608, 2012లో 733, 2013లో 708 రన్స్ చేయగా.. ఆపై KL రాహుల్ 2020లో 670, 2021లో 626, 2022లో 616 పరుగులు రాబట్టాడు. ఇక 2023లో 639, 2024లో 741, 2025లో 657 చేసిన కోహ్లీ.. వరుసగా 4 సీజన్లోనూ 600+ రన్స్ చేస్తాడేమో చూడాలి.