ATP: శ్రీరామనవమి పండుగ సందర్భంగా తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సీతమ్మవారికి మంగళసూత్ర ధారణ, తలంబ్రాల వేడుకను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.