TG: రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. రేపు, ఎల్లుండి జరిగే ఈ స్పోర్ట్స్ మీట్లో ప్రజాప్రతినిధులతో పాటు విద్యార్థులు, యువత కూడా పాల్గొంటారు. క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి ప్రకటించారు. నేతల మధ్య ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఈ వేడుకలు వేదిక కానున్నాయి.