స్వాతంత్య్ర సమరయోధుడు శివరామ్ హరి రాజ్‌గురు ధైర్యసాహసాలకు నిలువుటద్దం. 1908లో మహారాష్ట్రలో జన్మించిన ఆయన.. భగత్ సింగ్, సుఖ్‌దేవ్‌లతో కలిసి బ్రిటిష్ పాలనపై గర్జించారు. సాండర్స్ హత్య కేసులో కీలక పాత్ర పోషించి, దేశ విముక్తి కోసం కేవలం 22 ఏళ్లకే నవ్వుతూ ఉరికంబం ఎక్కారు. సంస్కృత పండితుడైన రాజ్‌గురు త్యాగం నేటికీ కోట్లాది మందిలో దేశభక్తిని రగిలిస్తోంది.