PPM: ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు విశ్వనాథపురం, చినమేరంగి పశు వైద్యశాలల భవన నిర్మాణాలపై చర్యలు చేపడతామని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా. ఎస్.మన్మధరావు తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన వార్తకు ఆయన గురువారం స్పందించారు. పాచిపెంట మండలం విశ్వనాథపురం పశు వైద్యశాల, జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో పశువైద్యశాల భవనాలు శిథిల స్థితిలో ఉన్నాయని చెప్పారు.