AP: నియోజకవర్గాల పునర్విభజనతో ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే ప్రజలకు పరిపాలన సౌలభ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. 2029 ఎన్నికల నాటికి 50 శాతం నియోజకవర్గాలు పెరుగుతున్నాయని తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బడ్జెట్ వల్ల ప్రాంతాల వారీగా జరిగే లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ఇంఛార్జ్ మంత్రులు తీసుకోవాలని చెప్పారు.