NRPT: నారాయణపేట పట్టణంలోని శివాజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల అవతారమెత్తి తమ తోటి విద్యార్థులకు ఆసక్తికరంగా పాఠాలు బోధించారు. అఖిల్ (కలెక్టర్), అర్చన (డీఈవో), విఘ్నేష్ (ఎంఈవో), మరియు శిల్ప (హెడ్ మాస్టర్) పాత్రలు పోషించి, ఆయా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.