MBNR: పాలమూరు యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో ఈనెల 30న CPRపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ఎస్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. ప్రవీణ తెలిపారు. గురువారం యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీఆర్ పట్ల ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.