KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ‘నూతన హెర్బేరియం సాంకేతిక పద్ధతులు, డిజిటల్ డాక్యుమెంటేషన్’ అంశంపై 2రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ మేరకు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. సెమినార్లు, వర్క్ షాపులు విద్యార్థుల శాస్త్ర పరిశోధన నైపుణ్యాల వృద్ధికి తోడ్పడతాయని కళాశాలల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు.