NZB: శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి శోభాయాత్రల నిర్వహణపై సీపీ పి.సాయిచైతన్య సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలు గతంలో అనుమతించిన పాత మార్గాల్లోనే జరగాలని, కొత్త రూట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా డీజేలు, డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఉత్సవ కమిటీలకు ఆయన సూచించారు.