GDWL: ఇటిక్యాలలో జరుగుతున్న పంటల సర్వే పనులను గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న సర్వే విధానం, డేటా నమోదు, సంబంధిత యాప్ వినియోగంపై అధికారుల ఫోన్లో ప్రత్యక్షంగా పరిశీలించి సూచనలు జారీ చేశారు. పంటల వివరాలు, భూమి పరిస్థితి ఫాలో, వేస్ట్ ల్యాండ్ వంటి అంశాలను కచ్చితంగా పరిశీలించి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.