NGKL: హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డిండి ప్రాజెక్ట్ వద్ద బోట్ సౌకర్యం కల్పించాలని అచ్చంపేట MLA వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం వెళ్లే పర్యాటకులకు డిండి ప్రాజెక్ట్ వద్ద కొద్దిసేపు ఆగి కాలక్షేపం చేయడానికి అవకాశం ఉంటుందని బోట్ సౌకర్యం కల్పించాలన్నారు.