NLG: వేములపల్లి మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర జాతర సందర్భంగా గురువారం ఉదయం దేవాలయ ఇన్ఛార్జ్ మేనేజర్ మృత్యుంజయ శాస్త్రి, దేవాలయ ఛైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్ నేతృత్వంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మృత్యుంజయ శాస్త్రి మాట్లాడుతూ.. 1లక్ష 20 వేల 99 రూపాయలు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.