MDK: తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గౌడి గూడెంలో ఇవాళ స్వాధీనం చేసుకున్న ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ ఇసుకను గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శికి అప్పగించినట్లు చెప్పారు. ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.