MDK: కౌడిపల్లి మండలం బుజరంపేట (పిర్యా) తండాలో విషాదం నెలకొంది. పొలంలో పనులు చేసుకుంటుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో రైతు సమ్యా నాయక్ మరణించినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఫిట్స్ రావడంతో ఆయన అదుపు తప్పి పొలంలోని బురదలో పడిపోయారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ముఖం బురదలో కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.