AKP: మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో అసలు దోషులను తప్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలు బాధాకరమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. బుధవారం అనకాపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు దోషులను తప్పించినా తమ ప్రభుత్వం వచ్చిన తరువాత తగిన విధంగా వారిని శిక్షించడం జరుగుతుందని హెచ్చరించారు.