SKLM: టెక్కలిలోని ప్రభుత్వ ఫిలింగ్ స్టేషన్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు RDO కృష్ణమూర్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ అధీకృత ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో 2 మేనేజర్, 6 పంప్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 31 లోపు టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.