KMM: ఖమ్మం జిల్లా యువతకు పీఎంఇంటర్న్ షిప్ పథకం కింద ప్రముఖ కంపెనీల్లో శిక్షణ పొందే సువర్ణావకాశం ఉందని జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం టి. సీతారాం తెలిపారు. 18-25 ఏళ్ల లోపు వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు దీనికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు స్టైఫండ్‌తో పాటు బీమా సౌకర్యం కల్పిస్తారని, వెంటనే పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.