ATP: తాడిపత్రి పట్టణం ఆంజనేయ మాన్యంలోని కేజీబీవీ బాలికల కళాశాలలో ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, భోజనం రుచి గురించి వారితో స్వయంగా మాట్లాడారు. వంటశాల, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి, తాజా కూరగాయలతో నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు.