TG: హైదరాబాద్లో పెట్రోల్ కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సీపీ సజ్జనార్ తెలిపారు. నగరంలో 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని.. సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల.. 2 రోజుల్లో అమ్ముడుపోవాల్సిన ఇంధనం ఒక్కరోజే అయిపోయిందని చెప్పారు.