ఖమ్మం జిల్లా పండితాపురం పశువుల సంత వేలం మంగళవారం ముగిసింది. బహిరంగ వేలంలో ఈ ఏడాది రూ. 2.09 కోట్ల ధర పలికింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మూడుసార్లు వేలం నిర్వహించినా కనిష్ఠ మద్దతు ధర రాకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారని అధికారులు తెలిపారు. తాజా వేలం వివరాలను జిల్లా కలెక్టర్కు నివేదించామన్నారు.