ప్రకాశం: గేట్–2026లో మార్కాపురానికి చెందిన ఇమ్మడి ఫణీంద్ర కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 13వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన తండ్రి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆంధ్ర యూనివర్సిటీలో మెటలర్జికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఫణీంద్ర, JSW ఉద్యోగాన్ని వదిలి కృషి, క్రమశిక్షణతో సిద్ధమై ఈ విజయాన్ని అందుకున్నాడు. పలువురు శుభాకాంక్షలు తెలిపారు.