MHBD: జిల్లాలోని పలువురు BRSV నాయకులను పోలీసులు ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. నేడు BRSV ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నాయకులను ముందస్తు అరెస్టు చేసి, స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.