ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు ప్రముఖ డెలివరీ సంస్థ స్విగ్గీ షాక్ ఇచ్చింది. తాజాగా స్విగ్గీ తన ప్లాట్ ఫారమ్ ఫీజును రూ.14.99 నుంచి ఏకంగా రూ.17.58 (GSTతో కలిపి)కి పెంచింది. ఇది దాదాపు 17 శాతం పెరుగుదల కావడం గమనార్హం. ప్లాట్‌ఫారమ్ నిర్వహణ, మెరుగైన సేవలకు అందించేందుకే ఈ ఫీజును సవరించినట్లు సంస్థ తన యాప్‌లో కస్టమర్లకు సమాచారం ఇస్తోంది.