KNR: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధం కావాలని, కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రణాళికపై జిల్లా ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది యాసంగి సీజన్లో రూ. 2 లక్షల 73 వేల 550 ఎకరాల్లో వరి ధాన్యం సాగు అయిందని వెల్లడించారు.