ప్రకాశం: కనిగిరి పట్టణంలోని శ్రీ బసవతారకం ఐటిఐ కళాశాలలో మంగళవారం భగత్ సింగ్ 95వ వర్ధంతి సభను డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నాయకులు, విద్యార్థులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా DYFI నాయకులు శ్రీను మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించాలని సూచించారు.