TG: హైదరాబాద్లోని మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ్టి నుంచి పోరుబాట కార్యక్రమం చేపట్టనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి పోరుబాటను ప్రారంభించారు. ఈనెల 14వ తేదీ వరకు మూసీ తీర ప్రాంతాల్లో బీఆర్ఎస్వీ బృందాలు పర్యటించనున్నాయి. మొత్తం 50 బృందాలు ప్రజలను కలిసి అన్ని అంశాలు వివరించనున్నట్లు సమాచారం.