VKB: బంట్వారం మండల పరిధిలోని తోర్మామిడి గ్రామంలో క్రైస్తవ సోదరులు ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమాన్ని శనివారం అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ సంజీవయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచారనే సత్యాన్ని చాటిచెప్పే సంప్రదాయంలో భాగంగా ఏటా ఈ పరుగు నిర్వహిస్తామన్నారు.