దాద్రానగర్ హవేలీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సిల్వాస్సాలోని డెమానీ రోడ్డులో ఉన్న ఒక నైట్రోజన్ గ్యాస్ రీఫిల్లింగ్ గోడౌన్లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ధాటికి గోడౌన్ పైకప్పు ఎగిరిపోవడమే కాకుండా, సిలిండర్ల ముక్కలు, ఇతర శిథిలాలు సమీపంలోని రహదారిపై పడ్డాయి. ఈ పేలుడు శబ్దంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.