PPM: టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. శనివారం కురుపాం మండలంలో స్థానిక కస్పగదవలస శ్రీ వేంకటేశ్వర ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) ఛైర్మన్ బీ.ఆర్. నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.