ATP: గుత్తిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవన నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు శనివారం స్థలాలను పరిశీలించారు. ప్రస్తుత కోర్టు, రెవెన్యూ కార్యాలయ ఆవరణలోని రెండు ప్రాంతాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని అధికారులు వెల్లడించారు. డీటీ నారాయణ, మున్సిపల్ శానిటరీ ఇన్స్ఫెక్టర్ మహబూబ్ బాషా పాల్గొన్నారు.