అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడి నాలుగేళ్లు గడిచినా మౌలిక వసతులు అభివృద్ధి చెందలేదు. పలు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నూతన కలెక్టరేట్ నిర్మాణం స్థల పరిశీలనకే పరిమితమైంది. దీంతో గిరిజనులకు పూర్తి స్థాయి జిల్లా పాలన అనుభూతి కలగడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.