SKLM: నరసన్నపేట మండలం యారబాడు గ్రామానికి చెందిన కోరుకొండ శాంతారావు తల్లి ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ నేతలు పిసిని చంద్రమోహన్, పతివాడ గిరీశ్వరరావు, కొవగాపు గౌతమ్, తదితరులు మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.