BHPL: వ్యవసాయ సాగులో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు జిల్లాకు ప్రభుత్వం 10 డ్రోన్లను మంజూరు చేయగా, సీఎస్ఆర్ నిధులతో మరో 12 అందుబాటులోకి రానున్నట్లు డీఏవో బాబురావు తెలిపారు. వీటిని మహిళా సంఘాలకు కేటాయిస్తామని, ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కో డ్రోన్ విలువ రూ.10లక్షలు కాగా, ప్రభుత్వం రూ.4 లక్షల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు.