NZB: మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మోరాలో సోమవారం రాత్రి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో పలు విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలు, డ్రంకన్ డ్రైవ్, సైబర్ క్రైమ్, షీ టీమ్స్ వంటి అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.