KRNL: సి.బెళగల్ మండల కేంద్రంలో పాండు రంగన్న గౌడ్ పేరు తెలియని వ్యక్తి ఉండరు. 2001 నుంచి 2021 వరకు టీడీపీ మండల కన్వీనర్‌గా పనిచేశారు. 2014లో స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ నుంచి ఒకే ఇంట్లో ముగ్గురు ఎంపీటీసీలు గెలుపొంది రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించారు. అయితే అధికార టీడీపీకి ఇప్పుడు దూరంగా ఉంటుండటంతో మండల వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.