AP: మచిలీపట్నంలోని జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు జిల్లా జడ్జికి ఈ-మెయిల్ పంపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులోకి ఎవరినీ అనుమతించలేదు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కోర్టు పరిసరాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.